Header Banner

విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఆ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్స్!

  Thu May 15, 2025 21:05        Others

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

 

ఈ ప్రత్యేక రైలు వివరాలు ఇలా ఉన్నాయి:

ట్రైన్ నెం. 07441 (చర్లపల్లి - విశాఖపట్నం): ఈ రైలు మే 17, 2025 శనివారం మధ్యాహ్నం 2గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు అంటే 18వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3గంటల 35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ట్రైన్ నెం. 07442 (విశాఖపట్నం - చర్లపల్లి): తిరుగు ప్రయాణంలో ఈ రైలు మే 18,2025 ఆదివారం రోజున రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 19వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

 

ఇక ఈ స్పెషల్ ట్రైన్స్ నల్లగొండ, మిరియాలగూడ,నడికుడి,గుంటూరు, విజయవాడ,ఏలూరు,రాజమండ్రి, సామర్లకోట,అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా చర్లపల్లి మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యం లభించనుంది. వేసవిలో తరచుగా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ఈ రైళ్లలో 3AC, 3AC (ఎకానమీ) క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ల రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణానికి సిద్ధమవుతున్నవారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఈ ప్రత్యేక రైళ్ల సమయం, ఇతరవివరాల కోసం రైల్వే వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌లను సంప్రదించవచ్చు. వేసవి రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ చర్యపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Visakhapatnam #VizagPassengers #SpecialTrains #IndianRailways #VizagTravel #GoodNews #TrainUpdates